DSC-08 SGT POSTINGS BREAK

టీచర్లకు బ్రేక్
డి.ఎడ్ అభ్యర్థులకు 30% రిజర్వేషన్ ఇవ్వండి

కౌన్సెలింగ్‌ను రీషెడ్యూల్ చేయండి..ట్రిబ్యునల్ ఆదేశం
రాష్ట్రవ్యాప్తంగా ఆగిన కౌన్సెలింగ్.. హైకోర్టుకు సర్కారు?
కేవియట్ దాఖలు చేసిన డి.ఎడ్ అభ్యర్థులు
హైదరాబాద్, జూన్ 28 : ఎన్నాళ్లుగానో వేచి చూస్తూ.. ఇటీవలే క్లియరెన్సుకు నోచుకున్న డీఎస్సీ-2008 నియామకాలకు మళ్లీ ఆటంకం ఏర్పడింది. ట్రిబ్యునల్ ఆదేశాలతో వేలాది మంది ఆశలపై నీళ్లు చల్లినట్లయింది. డీ ఎస్సీ-2008 (ఎస్జీటీ) నియామకాల్లో 30% పో స్టులను డీఈడీ అభ్యర్థులతో భర్తీచేయాలని ఆంధ్రప్రదేశ్ అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్ సోమవారం ఆదేశించింది.

గత ఏడాది మేలో ఉత్తీర్ణులైన అభ్యర్థులను కూడా ప్రతిభ ఆధారంగా ఈ పోస్టులకు ఎం పిక చేయాలని స్పష్టం చేసింది. ఈ మేరకు డీఎస్సీ కౌన్సెలింగ్‌ను రీ-షెడ్యూల్ చేయాలని సూచించింది. దీంతో ఉపాధ్యాయుల కౌన్సెలింగ్‌కు బ్రేక్ పడింది. డీఈడీ, బీఈడీ అభ్యర్థులతో 2008 ఎస్జీటీ పోస్టులను భర్తీ చేయాలంటూ ప్రభుత్వం ఈ నెల 21న జీవో నం. 27ను జారీ చేసింది.

డీఈడీ అభ్యర్థులకు 30% రిజర్వేషన్ కల్పిస్తూ.. గత ఏడాది జనవరి 29న ప్రభుత్వం జీవో నం. 28 జారీ చేసింది. తాజాగా ప్రభుత్వం జారీచేసిన జీవో 27లో ఈ నిబంధన లేకపోవడంతో డీఈడీ అభ్యర్థులు ట్రిబ్యునల్‌ను ఆశ్రయించారు. ఈ పిటిషన్‌ను విచారించిన ట్రిబ్యునల్ చైర్మన్ జస్టిస్ యతిరాజులు, సభ్యుడు అన్వర్‌లతో కూడిన డివిజన్ బెంచ్ ఈ ఆదేశాలు జారీచేసింది. ట్రిబ్యునల్ తీర్పుతో ఉపాధ్యాయుల కౌన్సెలింగ్‌కు బ్రేక్ పడింది. షెడ్యూల్ ప్రకారం మంగళ, బుధవారాల్లో జరగాల్సిన కౌన్సెలింగ్ కూడా వాయిదా పడింది. 

ఈ మేరకు ప్రభుత్వం మెమో నెం. 11814 జారీ చేసింది. పాఠశాల విద్యాశాఖ ఇచ్చిన ఉత్తర్వుల మేరకు అన్ని జిల్లాల్లో సోమవారం రాత్రి కౌన్సెలింగ్ నిలిచిపోయింది. అయితే, సోమవారం రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 3 వేల మంది టీచర్లకు కౌన్సెలింగ్ పూర్తయినట్లు సమాచారం. వారందరికీ నియామక పత్రాలు కూడా అందజేశారు. ట్రిబ్యునల్ తీర్పు నేపథ్యంలో తదుపరి ఉత్తర్వులు అందేవరకు డీఎస్సీ కౌన్సెలింగ్ షెడ్యూల్ వాయిదా వేయాలని డీఈవోలను ఆదేశించారు. 

మరోవైపు.. డీఎస్సీ-2008 నోటిఫికేషన్ ప్రకారమే నియామకాలు చేపట్టాలంటూ పాఠశాల విద్యాశాఖ డీఈవోలకు ఆదేశాలు జారీ చేసింది. అందుకు అనుగుణంగానే ఇప్పటికే టీచర్ పోస్టులకు ఎంపికైన అభ్యర్థుల ప్రొవిజినల్ లిస్టును విడుదల చేశారు. అన్ని జిల్లాల్లో ఈ ప్రక్రియ ముగిసింది. ఎంపికైన టీచర్లకు పోస్టింగ్ ఇచ్చేందుకు సోమవారం కౌన్సెలింగ్ మొదలైంది. ఈ నెల 30 వరకు ఈ పర్వం కొనసాగాల్సి ఉంది. ఈ తరుణంలో రాష్ట్ర పరిపాలనా ట్రిబ్యునల్ తాజా తీర్పు వెలువరించింది. 

ట్రిబ్యునల్ తీర్పునే అమలుచేయాలని సర్కారు భావిస్తే ఎంపికైన అభ్యర్థుల జాబితాను మరోసారి మార్చాలి. కానీ రాష్ట్రప్రభుత్వం ట్రిబ్యునల్ ఇచ్చిన తీర్పుపై హైకోర్టులో అప్పీల్ చేసి స్టే తెచ్చుకోడానికి ప్రయత్నం మొదలుపెట్టింది. సోమవారమే హైకోర్టుకు వెళ్లాలని పాఠశాల విద్యాశాఖ భావించినా, ట్రిబ్యునల్ ఇచ్చిన తీర్పు కాపీ ఆలస్యంగా అందటంతో ఆగిపోయింది. కానీ మంగళ లేదా బుధవారాల్లో కోర్టులో అప్పీల్ చేయాలని నిర్ణయించారు. డీఎస్సీ-2008 నియామక ప్రక్రియపై రాష్ట్ర ప్రభుత్వ వాదనను హైకోర్టు ఆమోదిస్తే .. టీచర్ల కౌన్సెలింగ్ యథావిధిగా కొనసాగే అవకాశం ఉండేది. 

కానీ హైకోర్టుకు వెళ్లాలనే సర్కారు నిర్ణయించటంతో ఏం జరుగుతుందో వేచిచూడాల్సిం దే. హైకోర్టులో వెంటనే తీర్పు రాకుంటే డీఎస్సీ-2008 కథ మళ్లీ మొదటికి వస్తుంది.ట్రిబ్యునల్‌లో విజయం సాధించిన డీఎడ్ అభ్యర్థులు హైకోర్టులో కెవియట్ దాఖలు చేసి ఉంచారు. దీంతో డీఎస్సీ-2008 నియామక ప్రక్రియపై అనిశ్చితి నెలకొంది. హైకోర్టులో జరగనున్న వాద, ప్రతివాదనలు టీచర్ల నియామక భవితవ్యాన్ని నిర్ణయించనున్నాయి.

KURNOOL DISTRICT DSC-2008 S.G.T.SELECTION MERIT CUM ROASTER LIST,DSC-08 S.G.T.URDU AND DSC-08 S.G.T.KANNADA LISTS

SERVICE RULES G.O'S[29&30] FOR GRADE-II HEAD MASTERS PROMOTION

http://sites.google.com/site/wwwaptf1938org